New Voter List | రాష్ట్రంలో ఓటర్లు 3.34 కోట్లు
New Voter List | రాష్ట్రంలో ఓటర్లు 3.34 కోట్లు
ఈసారి కొత్తగా 8,02,805 ఓటర్లు నమోదు
4,14,165 మంది ఓటర్ల తొలిగింపు
అభ్యంతరాలకు అక్టోబర్ 29 నుంచి ఈ నెల 28 వరకు గడువు
చివరి ఎన్‌రోల్‌మెంట్‌కు ఈ నెల 28 వరకు గడువు
వచ్చే ఏడాది జనవరి 6న ఓటర్ల తుది జాబితా వెల్లడి
కొత్త ఓటర్ జాబితా విడుదల చేసిన సీఈవో తెలంగాణ
Hyderabad : రాష్ట్రంలో ప్రస్తుతం 3,34,26,323 ఓటర్లు ఉన్నట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO-Telangana) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో కొత్త ఓటర్ జాబితా విడుదల చేశారు. అయితే సరి చేసిన ఓటర్ల జాబితాలను అక్టోబర్ 29న విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించామన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,34,26,323 ఉన్నట్లు తెలిపారు. వీరిలో1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే జాబితాలో పురుషులకంటే కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. దీని ప్రకారం 1,90,654 మంది స్త్రీలు ఎక్కువగా నమోదయ్యారు. థర్డ్ జెండర్లు 2,777 ఓటర్లుగా నమోదయ్యారు. అయితే మొత్తం ఓటర్లలో కొత్త ఓటర్లు (18 నుంచి 19 సంవత్సరాల వారు) 4,73,838 మంది, వృద్ధులు (85 సంవత్సరాలు పైబడిన) 2,25,462 మంది, వికలాంగులు 5,28,085 మంది, ఓవర్సీస్ వారు 3,578 మంది నమోదయ్యారు. ఓటర్లు సవరింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,02,805 మంది ఓటర్లను తొలిగించారు. కొత్తగా 4,14,165 మంది నమోదు చేసుకున్నారని, తప్పుల సవరణ, మార్పులు 5,93,956 మంది చేసుకున్నట్లు తెలంగాణ సీఈవో ప్రకటించారు.
* ఓటర్ల జాబితాకు సంబంధించిన ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి..
* కొత్త ఓటర్లు, సవరణలకు ఈ నెల 9, 10 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
* ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్ జాబితా వెరిఫికేషన్‌కు ఓటర్లకు అవకాశం
* ఈ మేరకు ఆయా పోలింగ్ స్టేషన్లలో జాబితాలు అందుబాటులో ఉంటాయి
* ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలకు అక్టోబర్ 29 నుంచి ఈ నెల 28 వరకు గడువు
* ఓటర్ల నమోదుకు ఈ నెల 28 వరకు తుది గడువు
* వచ్చే ఏడాది జనవరి 6న ఓటర్ల తుది జాబితా వెల్లడి
* ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచుతారు.
* జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఎన్‌రోల్‌మెంట్‌కు అవకాశం
*ఈ నెల 28 వరకు గడువు తేదీగా నిర్ణయించారు.
* ఓటర్ల నమోదుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950కి ఫోన్ చేసి తెలుసుకోవాలని సీఈవో సూచించారు.
* * *
Leave A Comment